పల్లవి:
జోరుమీదున్నావు తుమ్మెద
నీ జోరెవరికోసమే తుమ్మెద
జోరుమీదున్నావు తుమ్మెద
నీ జోరెవరికోసమే తుమ్మెద
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెద
నీ ఒళ్ళు జాగరతే తుమ్మెద
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెద
నీ ఒళ్ళు జాగరతే తుమ్మెద
జోరుమీదున్నావు తుమ్మెద
నీ జోరెవరికోసమే తుమ్మెద
చరణం:
ముస్తాబు అయ్యావు తుమ్మెద
కస్తూరి రాశావు తుమ్మెద
మసక ఎన్నెలోన తుమ్మెద
మల్లెపందిరి కాడ తుమ్మెద
మాల కడుతున్నావు తుమ్మెద
ఆ మాలెవరికోసమే తుమ్మెద
జోరుమీదున్నావు తుమ్మెద
నీ జోరెవరికోసమే తుమ్మెద
చరణం:
మెత్తన్ని పరుపూలు తుమ్మెద
గుత్తంగా కుట్టావు తుమ్మెద
ఒత్తైన పరుపుపై తుమ్మెద
అత్తర్లు చల్లావు తుమ్మెద
పక్క వేసుంచావు తుమ్మెద
ఆ పక్కెవరికోసమే తుమ్మెద
జోరుమీదున్నావు తుమ్మెద
నీ జోరెవరికోసమే తుమ్మెద
చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : దాసం గోపాలకృష్ణ
గానం : పి.సుశీల