పల్లవి:
ఇదిగో తెల్ల చీరా.. ఇదిగో మల్లె పూలు
ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో
తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు..
ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..
ఇదిగో తెల్ల చీరా... ఇదిగో మల్లె పూలు
ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా..
తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు..
ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి
చరణం 1:
కాకి చేత పంపిస్తే కబురందిందా... కళ్ళారా చూడగానే కథ తెలిసిందా...
కాకి చేత పంపిస్తే కబురందిందా ...కళ్ళారా చూడగానే కథ తెలిసిందా
ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ
ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ...
ఆలు లేదు.. చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం
ఆదిలోనే బారసాల... చేసుకోవా సీమంతం..ఓలొ..లో..లో..హాయ్...ఓలొ..లో..లో..హాయ్...
ఇదిగో తెల్ల చీర..ఆఆ.. ఇదిగో మల్లె పూలు.. ఊఊఊ
ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో
తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు..
ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..
చరణం 2:
సూది కోసం సోదికెళితే సుడి తిరిగిందా..
మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా..
సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా ...
మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా ..
కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా... పొద్దైనా అయ్యో నువ్వే ఊపాలా..
నేనే జోల పాడుతుంటే... నువ్వు నిద్దర పోతావా
అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా.. ఉలులు..లుల..హాయ్...
ఆఁ...ఉలులు..లుల..హాయ్...ఆఁ...
ఇదిగో తెల్ల చీర ఆ..ఇదిగో మల్లె పూలు అహా...
ఇదిగో తెల్ల చీర..ఇదిగో మల్లె పూలు...
తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా..
తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు..
ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి...
చిత్రం : ఊరికి మొనగాడు (1981)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం: S.P.బాలు, P.సుశీల