
మెల్లమెల్లగా నీతోనే కలకాలం గడపాలిలా
మనసారా నిన్ను ప్రేమిస్తున్నా ప్రియతమా ప్రియతమా
చూస్తూ చూస్తూ నీకన్నుల్లో కరిగిపోతానిలా
మనసారా నీకు మనసిస్తున్నా ప్రియతమా ప్రియతమా
ఓఓహ్ yo^r my cyndirella, love ఇంత wonderfullaa
నిజం, నువ్వు లేకపోతే గుండెలో గిలగిల
ప్రేమలో ప్రతిక్షణం, ఉందిలే పరవశం
అందుకే జీవితం నీకిలా అంకితం
మెల్లమెల్లగా నీతోనే కలకాలం గడపాలిలా
మనసారా నిన్ను ప్రేమిస్తున్నా ప్రియతమా ప్రియతమా
చరణం 1 :
నాకేప్పుడేప్పుడు నీతలపే , గుండెచప్పుడు నీవరకే
మల్లెతీగలా అల్లుకున్నది నన్ను ఆదమరపే
మది కోరుకున్నది నీపిలుపే, ఇక్కడిక్కడే వినిపించిందే
రెక్కలొచ్చిన కొత్త ఊహలే నన్ను మేలుకొలిపే
అందమైన ప్రేమకథలా.....అచ్చమైన తీపి కలలా
జ్ఞాపకాల జీవనదిలా సాగుదామిలా
చేరువైతే ఇంతగుబులా.....దూరమైతే అంత దిగులా
ప్రేమ అల్లరేంటో chanti పాపలా
ఓఓహ్ yo^r my cyndirella, love ఇంత wonderfullaa
నిజం, నువ్వు లేకపోతే గుండెలో గిలగిల
ప్రేమలో ప్రతిక్షణం, ఉందిలే పరవశం
అందుకే జీవితం నీకిలా అంకితం
మెల్లమెల్లగా నీతోనే కలకాలం గడపాలిలా
మనసారా నిన్ను ప్రేమిస్తున్నా ప్రియతమా ప్రియతమా
చరణం 2 :
నా చూపులెప్పుడు నీమీదే, కోటి ఆశలు నీమీదే
ఎంతసేపిలా నిన్ను చూసినా చాలు చాలు అనదే
మనసివ్వడానికి ఉంటుందే, అది ఇప్పుడిప్పుడే తెలిసోచ్చిందే
వెళ్లిరమ్మని సాగనంపితే, నిన్ను వదిలిరాడే
పొంగుతున్న ఏటి అలవై....తాకుతున్న గాలితెరవై
పూటకొక్కపూలరుతువై చేరుకో ఇలా
నీలినింగిలోని మెరుపై....జారుతున్న వానచినుకై
వచ్చివాలిపో నా చిట్టిగువ్వలా
ఓఓహ్ yo^r my cindirella, love ఇంత wonderfullaa wonderfullaa
నిజం, నువ్వు లేకపోతే గుండెలో గిలగిల
ప్రేమలో ప్రతిక్షణం, ఉందిలే పరవశం
అందుకే జీవితం నీకిలా అంకితం
మెల్లమెల్లగా నీతోనే కలకాలం గడపాలిలా
మనసారా నిన్ను ప్రేమిస్తున్నా ప్రియతమా ప్రియతమా
చిత్రం : మనసారా (2010)
సంగీతం : శేఖర్ చంద్ర
రచన : భాస్కర భట్ల రవికుమార్
గానం : కృష్ణ చైతన్య, గీతామాధురి
*************************************
Movie Name : Manasara (2010)
Music Director : Sekhar Chandra
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer : Krishna Chaithanya, Geetha Madhuri