ఆలాపన :
అమ్మా... నాన్నా...
పల్లవి :
అమ్మా... అమ్మా అని అరచినా
ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా
చరణం : 1
పది నెలలు నను మోసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో
ఊడిగాలు చేసినా
ఓ తల్లీ నిను నలుగురిలో
నగుబాటు చేసితి
తలచకమ్మ తనయుని తప్పులు
క్షమియించవమ్మా
అమ్మా... అమ్మా...
చరణం : 2
దేహము విజ్ఞానము
బ్రహ్మోపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే
హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున
ఇలువెడల నడిపితీ
కనిపిస్తే కన్నీళ్ళతో
కాళ్లు కడుగుతా నాన్నా
నాన్నా... నాన్నా...
చరణం : 3
మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
నీ మాటా దాటనమ్మ
ఒక మారు కనరమ్మా
మాతాపిత పాదసేవే
మాధవసేవేయని మరువనమ్మా
మాతాపిత పాదసేవే
మాధవసేవేయని మరువనమ్మా
నన్నూ మన్నించగ రారమ్మా...
అమ్మా.... అమ్మా....
చిత్రం : పాండురంగ మహాత్మ్యం (1957)
సంగీతం : టి,వి.రాజు
రచన : సముద్రాల
గానం : ఘంటసాల