నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
కమ్మని జోలలతో చిననాటి ఆ కల
కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా
తీరని ఊహలా తీరని ఆశలా
అలనాటి జ్ఞాపకాల కోవెల
కోయిల పాటలా కోరిన కోటలా
పిలిచింది నన్ను కోటి గొంతులా
చెరిగిన శాంతి చెదిరినకాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
నీ కొనవేలితో మొదలైంది ఈ కదం
నీ చనుబాలతో పదునైంది పౌరుషం
నీ ఎదలో లయ వినపడనీయక
నను ఆపకమ్మ కాలు తూలగా
నీ కనుపాపలో కాంతిని ఈయక
కరిగించకమ్మ కంటి నీరుగా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
చిత్రం : యువకుడు (2000)
సంగీతం : దేవా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : పార్ధసారథి