నేస్తమా ఓ ప్రియనేస్తమా
ప్రియతమా నాలో ప్రాణమా
నీలో ఉన్న నన్నే చూడనంటు పంతమా
తెరచాటు దాటి దరిచేరుమా
ఎడబాటు దూరం కరిగించుమా
నేస్తమా ఓ ప్రియనేస్తమా
నీ గుండెల్లో చూడమ్మా
నేను లేనా ఏ మూలో
నీ ఊపిరిలో వెతుకమ్మా
చేరుకున్నా ఏనాడో
మనసిచ్చావు నాకే కదా
అది వదిలేసి పోతే ఎలా
ఎక్కడున్నా చెలీ నీ యదా
నిన్ను నా వైపు నడిపించదా
వెళ్ళే దారులన్ని నన్ను చూపే వేళలో
కనుమూసుకుంటే కనిపించనా
యదలోని పాటై వినిపించనా
నేస్తమా ఓ ప్రియనేస్తమా
నా గుండెల్లో ఈ భారం
దాటనంది ఈ దూరం
నా ఊపిరిలో ఈ మౌనం
పాడనంది ప్రియ గానం
అన్నీ తెలిసున్న అనురాగమా
నన్ను వెంటాడటం న్యాయమా
రెప్ప వెనకాల తొలి స్వప్నమా
ఉప్పు నీరై ఉబికిరాకుమా
కమ్మని జ్ఞాపకంలా ఊహలో నిదురించుమా
మనసందుకున్న మమకారమా
మరిపించు వరమై దీవించుమా
నేస్తమా ఓ ప్రియనేస్తమా
ఆగుమా ఆశల వేగమా
మానని గాయమింక రేపుతావా స్నేహమా
ఈ జన్మకింతే మన్నించుమా
మరు జన్మ ఉంటే నీదే సుమా
చిత్రం : లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం : M.M. కీరవాణి
రచన : సిరివెన్నెల
గానం : సోనూ నిగమ్ , సునీత