పల్లవి
[అతడు] చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నాకోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా
[ఆమె] వద్దొద్దంటున్నా వస్తూనే ఉన్నా
కలికాలం నీతోగిల్లి నా ఇళ్ళను అనుకుంటా
వచ్చెయ్యనా వచ్చెయ్యనా మోహమాటు ఇంకా మనకేలా
వచ్చెయ్యనా వచ్చెయ్యనా ఆరాటమేదో కలిగేలా
[అతడు] వచ్చెయ్యనా వచ్చెయ్యవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా వచ్చెయ్యవా
[ఆమె] సరియో సరియో సరియో నేనే వస్తానుగా
సరియో సరియో సరియో నేను ఉంటానుగా
[అతడు] సరియో సరియో సరియో నువ్వేకావాలిగా
సరియో సరియో సరియో నాకే ఇల్లాలుగా
||చూడొద్దంటున్న||
చరణం 1
[అతడు] నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా
కాసేపైనా కనపడకుంటే కలవర పడుతుంటా
[ఆమె] పక్కన నువ్వే ఉన్నావనుకొని పొరబడి పోతుంటా
నిద్దరలోన తలగడని ఎన్నో ముద్దులు పెడుతుంటా
[అతడు] ఎదురుగ్గా ఎవరున్నా యెదనిండా నువ్వంటా
ఎవ్రిడే ఒకసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా
[ఆమె] చుట్టూరు ఎందరు ఉన్నా ఒంటరి నవుతుంటా
నువ్వులేని లైఫే బోరని ఫీలైపోతుంటా
[అతడు] వచ్చెయ్యవా వచ్చెయ్యవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా వచ్చెయ్యవా
[ఆమె] సరియో సరియో సరియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో డ్యూటి ఇస్తానుగా
[అతడు] సరియో సరియో సరియో నువ్వే రావాలిగా
గడియో గడియో నేను విన్నానుగా
||చూడొద్దంటున్నా||
చరణం 2
[అతడు] ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదే అనుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
[ఆమె] నీవెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బంధీనయ్యి భాగ్యం ఇమ్మంటా
[అతడు] నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా
నీకోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా
[ఆమె] నీకన్నా విలువైంది నాకేదీ లేదంటా
నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా
[అతడు] వచ్చెయ్యవా వచ్చెయ్యవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా వచ్చెయ్యవా
[ఆమె]సరియో సరియో సరియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
[అతడు]సరియో సరియో సరియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
||చూడొద్దంటున్నా||
చిత్రం : పోకిరి (2006)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : కార్తీక్ , మహాలక్ష్మి అయ్యర్