పూర్తి పేరు : దారివేముల రామజోగయ్యశాస్త్రి
జననం : 24-08-1970
జన్మస్థలం : ఆరేపల్లి ముప్పాళ్ల, గుంటూరు
తల్లిదండ్రులు : సరస్వతమ్మ, సూర్యప్రకాశరావు
చదువు : ఎం.టెక్. (ఐఐటి ఖరగ్‌పూర్)
వివాహం - భార్య : 09-06-1995 - సత్యప్రియ
సంతానం : కుమారులు (సాయితేజ, సాయిహర్ష)
తొలిచిత్రం-పాట : యువసేన (2004) - ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురవూ
పాటలు : 300లకు పైగా (ఇప్పటి వరకు)
నటించిన సినిమా : కింగ్ (2008)
అవార్డులు : ఖలే జా సినిమాలో ‘నదాశివా సన్యాసీ’ అనే పాటకు 2010లో ఫిలింఫేర్ అవార్డు, మరికొన్ని సంగీత అవార్డులు.
ఇతర విషయాలు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ, ఆయన ఆశీస్సులతో 2004లో యువసేన సినిమాతో గీతరచయితగా పరిచయమయ్యారు రామజోగయ్యశాస్త్రి. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. రగడ, ఖలేజా, దడ, శక్తి, దూకుడు, 100% లవ్, Mr.పర్‌ఫెక్ట్, బాడీగార్డ్, గబ్బర్‌సింగ్, జులాయి ఇలా ఎన్నో సినిమాలకు ఆయన రాసిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి.