అంటిపెట్టుకున్న నా పచ్చబొట్టులా నూరేళ్ళకే తోడుగా
నిన్ను చుట్టుకుందునా పూలచెట్టులా...ఆ ఆ ఆ
నువ్వు కోరినట్టుగా ఉండలేనుగా నీ తోడు లో హాయిగా
లెక్కపెట్టుకుందునా కొద్ది జీవితం ఇలా
కమ్మిన చీకటి వెళిపోదా వెన్నెల దీపం వెలిగాక
ఓ క్షణమైనా సరిపోదా మగువా నీ మది గెలిచాక
నీ వెంట నడిచెను నా పాదం నువ్వేలే కదా నా గమ్యం
అదిగో పిలిచెను నవలోకం మనసులు కలిసిన మన కోసం
ఉరిమిన మేఘం కరిగెను వర్షం కురిసిన దాహం తీర్చెనులే
తరిమిన లోకం భయపడి శ్లోకం అయ్యెనులే
తగిలిన గాయం చిటికెలొ మాయం చెలిమిన సాయం అందగనే
అర్ధం కాకుందే
చెరితల గురుతులు కనలేదా జరిగిన కధలే వినలేదా
కలవరమన్నది వెళిపోక నీతో ఉండదు కడదాక
నీ మాటల్లో నిజమే కనపడి ధైర్యం నిండెను గుండెల్లో
ఉరికే చిలకై మనసంతా రివ్వున ఎగిరే గగనంలో
గడిచిన కాలం తలచుట నేరం తలకొక భారం వదిలేసెయ్
విడిచిన మౌనం పలికెను గానం ఈ క్షణమే
తనువుల దూరం తరుగుట ఖాయం వలపుల తీరం చేరగనే
అంటిపెట్టికున్న నా పచ్చబొట్టులా నూరేళ్ళకే తోడుగా
నిన్ను చుట్టుకుందునా పూలచెట్టులా...ఆ ఆ ఆ
నువ్వు కోరినట్టుగా ఉండలేనుగా నీ తోడు లో హాయిగా
లెక్కపెట్టుకుందునా కొద్ది జీవితం ఇలా
చిత్రం : 16 డేస్ (2009)
సంగీతం : ధరణ్
రచన : భాస్కర భట్ల
గానం : బాంబే జయశ్రీ, హరిచరణ్