పల్లవి :
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్ ఓ మై లవ్.. ఓ మై లవ్ ఓ మై లవ్ (2)
చరణం :
కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనై
వెన్నెల్లో దీపంలా ఓ తారనై నీకోసం నేనున్నా నీవాడినై
బాధే కదా ప్రేమంటే… ప్రేమే కదా నీవంటే…
ఐనా తీపే తోడుంటే…
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
చరణం:
చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుంటే తేనీటిలో తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమా నీ ప్రేమకే ఈ జన్మా
నీవే నేనైపోతుంటే…
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్ ఓ మై లవ్.. ఓ మై లవ్ ఓ మై లవ్
చిత్రం : రాజకుమారుడు (2004)
సంగీతం : మణిశర్మ
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు , చిత్ర