హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
ఆమ్మ పంచే ప్రేమలోనా అమృతాలే అందగా
పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా
హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
ఆమ్మ పంచే ప్రేమలోనా అమృతాలే అందగా
పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా
వానలోన తడిచొస్తుంటే ఊరుకోగలదా
అంతలోనే ఆయొచ్చిందో తట్టుకోగలదా
పాఠమే చెపుతుండగా ఆట పట్టిస్తే
మీనాన్నతో చెబుతానని వెళుతుంది కోపగించి
మరి నాన్నలా తిడుతుండగా తను వచ్చి ఆపుతుంది
మమతలు మన వెంట తోడుంటే
హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
పాలు నీళ్ళై కలిసే వారి అలుమగలైతే
పంచదారై కలిసిందంట పాప తమలోనే
ఆమని ప్రతి మూలలో ఉంది ఈ ఇంట
ప్రతి రోజున ఒక పున్నమి వస్తుంది సంబరంతో
కలకాలము కల నిజములా కనిపించెనమ్మ కంట్లో
కళ కళలే కళ్ళ ముందుంటే
హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
ఆమ్మ పంచే ప్రేమలోనా అమృతాలే అందగా
పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా
చిత్రం : కావ్యాస్ డైరీ (2009)
సంగీతం: మను రమేషన్
రచన : అనంత్ శ్రీరామ్
గానం : హేమచంద్ర
**********************************
Movie Name : Kavyas Dairy (2009)
Music Director : Manu Rameshan
Lyricist : Ananth Sriram
Singer : Hemachandra