వెళ్ళిపోతె ఎలా మనసా ఎటో అలా
ఆయిన ఎందుకె ఇలా తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే
తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే
ఈ ఉరుకులెందుకంట
వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఎలా
ఆమె వలలో చిక్కుకున్న సమయం
ప్రేమ లయలో దూకుతోందా హృదయం
నేను ఇపుడెక్కడున్నానంటే
నాక్కూడ అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే
నాకేదో మత్తు కమ్మినట్టే
రమ్మంది కాని నన్ను చేరి మెరుపు సైగ చేసి
చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతెనేసి
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే హే
తాను కూడ రాకపొతే నాతో
నేను కూడా ఆగిపొనా తనతొ
నా ప్రాణం ఉంది తన వెంటే
నా ఊపిరుంది తననంటే
కళ్ళార చూసానంటు వుంటే
ఎల్లా నమ్మేదీ స్వప్నమంటే
వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే హే
చిత్రం : ఒకరికి ఒకరు (2003)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎం.ఎం.కీరవాణి , శ్రేయా ఘోషల్
***********************************
VeLLipOte elaa manasaa eTO alaa
Ayina enduke ilaa taDabaaTu antalaa
tega hushaarugaa egiripOkE
tagani Uha venTa
saraina daari teliyandE
I urukulendukanTa
VeLLipOtE elaa VeLLipOtE elaa
Ame valalO chikkukunna samayam
prEma layalO dookutOndaa hRdayam
nEnu ipuDekkaDunnaananTE
naakkooDa antu chikkakunTE
gammattugaanE unnadanTE
naakEdO mattu kamminaTTE
rammandi kaani nannu chEri merupu saiga chEsi
cheppindi ningi cheli daari chinuku vantenEsi
veLLananTE elaa manasaa aTE alaa
veLLananTE elaa elaa hE hE
taanu kooDa raakapotE naatO
nEnu kooDaa aagiponaa tanato
naa praaNam undi tana venTE
naa Upirundi tanananTE
kaLLaara choosaananTu vunTE
ellaa nammEdii swapnamanTE
venakki veLLi vetakaali tirigi aa kshaNaanni
marokkasaari chooDaali kanulu aa nijaanni
veLLananTE elaa manasaa aTE alaa
veLLananTE elaa elaa hE hE
Movie Name : Okariki okaru (2003)
Music Director : M.M.keeravani
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : M.M.Keeravani , Shreya Ghoshal