జన్మమెత్తితిరా... అనుభవించితిరా ||2||
బ్రతుకు సమరంలో పండిపోయితిరా ||2||
అనుపల్లవి
మంచి తెలిసి మానవుడుగ మారినానురా... ||జన్మ||
చరణం : 1
స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా ||స్వార్థమను||
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా ||2||
సమరభూమి నా హృదయం శాంతి పొందెరా ||జన్మ||
చరణం : 2
క్రోధలోభ మోహములే పడగలెత్తెరా
బుసలుకొట్టి గుండెలోన విషముగ్రక్కెరా ||క్రోధలోభ||
ధర్మజ్యోతి తల్లివోలె ఆదరించెరా ||2||
నా మనసే దివ్య మందిరముగ మారిపోయెరా ||జన్మ||
చరణం : 3
మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా ||మట్టియందె||
ప్రతిగుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా ||2||
ఆ దివ్య స్వరం న్యాయపథం చూపగగలుగురా ||జన్మ||
చిత్రం : గుడి గంటలు (1964)
సంగీతం : ఘంటసాల
రచన :
గానం : ఘంటసాల