పల్లవి
[అతడు] తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా
చికుచికు చిందయ్ అన్నానా ||2||
ముద్దుచాల్లే మీనా అది ఎంత చిన్నదైనా
చక్చక్ ఇచ్చేయ్ అన్నానా
కన్నుగీటితే సుల్తానా కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల జబ్బర్ దస్తి నాదే వేసైనా ||తిల్లానా||చరణం 1
[ఆమె] పైట బెంగుపాడిందయ్యో పరువాల పాట
పట్టిపట్టి నువు చూపిస్తే అదిరేను వాలాన
[అతడు] కల్లా కపటమేదిలేని జవరాల బాద పట్టే మంచం వేసే ఇంట చెలరేగిపోదా
[ఆమె] వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మో
[అతడు] కులాసాల సందిట్లో విలాసాల వేణమ్మ
[ఆమె] పదారేళ్ళ ఒంపుల్లో మజా తీర్చుకుందామా
[అతడు] పదాలింక చాలించి పెదాలందు కుందామా
[ఆమె] సడేలేని ముంగిట్లో సడే చేసుకుందామా ||తిల్లానా||
చరణం 2
[అతడు] ఎర్రపాటి కుర్రాళ్ళంతా ఎనకాలవుంటే నల్లపిల్లగాళ్ళే కోరి మనసివ్వనేల
[ఆమె] నల్లనల్ల మేఘంలోనే నీరుండదంట నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంట
[అతడు] మారాల చేమంతి నీ ఒళ్ళే వుయ్యాల
[ఆమె] మందార పూవల్లే ఎర్రబారే సందేళ
[అతడు] చందనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే ఈ వేళ
[ఆమె] చెంగుపట్టి ఏకంగా వెన్న దోచుకోవాల
[అతడు] గట్టు దాటి గో దారల్లే నేల వంచి వెయ్యాలా ||తిల్లానా||
చిత్రం : ముత్తు (1995)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : భువన చంద్ర
గానం : మనో , సుజాత