ఏ జన్మదో .. ఈ ఫలము
ఈ జన్మకే .. ఒక వరము
ఎదురైన .. అమృతము
కవ్వించే .. నవ్వించే .. లాలించే స్నేహమింక
నీలో ఆనందం పొంగించే !
చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !
ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !
గాలి లోని పరిమళాలు గాలివా ..పూలవా ..
తోడుగా .. విచ్చెనే
నేల చేరు వాన చినుకు నేలదా.. నింగిదా..
నేలపై .. చేరెనే
పెదవిపై నవ్వు పూసింది
తానుగా విరియలేదంది
ఈ ఇంద్రజాలు నీవేలే
చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !
ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !
ఆకాశాన గాలిపటము ఎగిరెనా.. భారమై.. నీవుగా .. వచ్చెనే
నువ్వు లేక నేనే లేను స్నేహమా .. నిలిచిపో.. నీడగా .. హాయిగా
చెలిమితో చొరవ చేసావు
కలిమితో అలుపే తీర్చావు
సరిక్రొత్త నేస్తం నీవేలే
చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !
ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !
హో.. ఏ జన్మదో .. ఈ ఫలము
ఈ జన్మకే .. ఒక వరము
ఎదురైనా .. అమృతమూ
కవ్వించే .. నవ్వించే .. లాలించే స్నేహమింక నీలో .. ఆనందం పొంగించే !
చరితలు చూడని వైనం
కన్నుల చేరిన స్వప్నం
వెన్నెల కూడిన తేజం ఇదాయే !
ఏడారి చేరిన చినుకై
గుండెకు సవ్వడిలాగా
నన్నే వీడని నేస్తం ..నీవాయే !
చిత్రం : నేస్తమా (2008)
సంగీతం: Joy Calwin
రచన : సారపు సంతోష్ కుమార్
గానం: కార్తీక్, చిన్మయి