పదునాలుగేండ్లు వనవాసమేగి మరలి వచ్చెను సీత
పరమ పావని ఆ మాత
సార్వభౌముడు శ్రీరామ చంద్రుని సన్నిధి కోరెను సీత
అదే పెన్నిధి అన్నది భూజాత
సత్య పరీక్షకు అగ్ని పరీక్షకు సాథ్వి జానకి నిలిచే
అఖిల జగములో సీత పునీతని అగ్ని దేవుడే పలికే అగ్ని దేవుడే పలికే
అల్పుని మాటలు ఆలకించెను న్యాయమూర్తి రఘు రాముడు
ఆమె కలుషితని అడవికి పంపెను
నిర్దయుడా శ్రీ రాముడు
రాముని దాచిన సీత మనసులో రగిలెను ఆరని ....
పూర్ణ గర్భిణికి పుణ్య రూపిణికి ఆశ్రయమొసగెను వాల్మీకి
ముని ఆశ్రమమున లవకుశ జననం సీతకు శాంతిని కలిగించె
సీతకు శాంతిని కలిగించె
పతి దూషణలే తలచి తలచి విలపించెను ఆ మాత
పిలిచెను భూమాత తల్లి గర్భమున కలిసెను భూజాత
జనని జానకి జీవితమంతా తీరని వియోగమాయే
చిత్రం : కృష్ణవేణి (1974)
సంగీతం : విజయ భాస్కర్
రచన :
గానం :
********************************
padunalugendlu vanavaasamegi marali vachenu seeta
parama paavani aa maata
sarwabhoumudu shrirama chandruni sannidhi korenu seeta
ade pennidhi annadi bhujata
satya pareekshaku agni pareekshaku saathvi jaanaki niliche
akhila jagamulo seeta puneetani agni devude palike agni devude palike
alpuni matalu aalakinchenu nyayamurti raghu raamudu
aame kalushitani adaviki pampenu
nirdhayudaa shri ramudu
ramuni daachina seeta manasulo ragilenu aarani ....
purna garbhiniki punya rupiniki ashrayamosagenu valmeeki
muni aashramamuna lavakusha jananam seetaku shantini kaliginche
seetaku shantini kaliginche
pati dushanale talachi talachi vilapinchenu aa maata
pilichenu bhumata talli garbhamuna kalisenu bhujata
janani janaki jeevitamantaa teerani viyogamaaye
Movie Name : Krishnaveni (1974)
Music Director : Vijaya Bhaskar
Lyricist :
Singers :