ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
ఇంక ఏదేమైనా రావే మైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అదరాలి నాలో అందం .. అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం .. మురిపాలు పిండేస్తే
ఒక మాటో .. అర మాటో .. అలవాటుగా మారే వేళ
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
చలువరాతి హంస మేడలో ఎండే చల్లనా
వలువ చాటు అందె గత్తెలో వయసే వెచ్చనా
వసంతపు తేనె తోనే .. తలంటులే పోయనా
వరూధినీ సోయగాలా .. వరాలు నే మీటనా
నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం
నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్విందీ రాగం
రెండు గుండెల్లోనా తప్పిందీ తాళం
మురిసింది తారా మూగాకాశంలో ..
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసి రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
ఇంక నేనేమైనా నీకేమైనా గాలై వీచి కూలే ప్రేమ తెలుసా
విధి నిన్ను ఓడిస్తుంటే .. వ్యధలాగ నేనున్నా
కధ మారి కాటేస్తుంటే .. కొడిగట్టి పోతున్నా
ఎడబాటే ఎద పాటై చలి నీరుగా సాగే వేళ
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
మనసులోన తీపి మమతలూ ఎన్నో ఉంటవీ
ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవీ
ఎడారిలో కోయిలమ్మ .. కచేరి నా ప్రేమగా
ఎదారినా దారిలోనే .. షికారులే నావిగా
కన్నె అందాలన్ని పంపే ఆహ్వానం
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం
స్వర్గలోకంలోనే పెళ్ళీ పేరంటం
సందె మైకంలోనే పండే తాంబూలం
మెరిసింది తారా ప్రేమాకాశంలో ..
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
ఇంక ఏదేమైనా రావే మైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అదరాలి నాలో అందం .. అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం .. మురిపాలు పిండేస్తే
ఒక మాటో .. అర మాటో .. అలవాటుగా మారే వేళ
ఓ ప్రేమా ..
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసి రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా ..
చిత్రం : అశ్వమేధం (1992)
సంగీతం: ఇళయరాజా
రచన :
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఆశా భోంస్లే