ఎందుకో నీవు నాతో ఉన్న వేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి(2)
మనసులోని మమతలన్ని మల్లె పూలై విరిసె నీకై(2)
వలపులన్ని పూల మాలై కురులలోన కులికె నీకై
ఎన్ని జన్మాలకైనా నీవు నాదానివేలే
ఇందుకు సాక్ష్యులు గిరులు తరులు గిరులు తరులు..
నీలి కన్నుల ఆలయాన నిన్ను స్వామిగా నిలుపుకోనా(2)
ఎల్లవేళలా జీవితాన నిన్ను దేవిగా కోలుచుకోనా
గౌరిశంకరుల చందం మనది విడిపోని బంధం
ఇందుకు సాక్ష్యులు సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు
చిత్రం : కృష్ణవేణి (1974)
సంగీతం : విజయ భాస్కర్
రచన :
గానం :
********************************************
yenduko nevu nato unna vela inta haayi
yenduko ninnu vidichi nimishamainaa niluvalenoyi(2)
manasuloni mamatalanni malle pulai virise neekai(2)
valapulanni pula maalai kurulalona kulike neekai
yenni janmaalakainaa neevu naadaanivele
induku saakshyulu girulu tarulu girulu tarulu..
neeli kannula aalayaana ninnu swaamiga nilupukonaa(2)
yellavelala jeevitaana ninnu deviga koluchukonaa
gowrishankarula chandam manadi vidiponi bandham
induku sakshyulu suryudu chandrudu suryudu chandrudu
Movie Name : Krishnaveni (1974)
Music Director : Vijaya Bhaskar
Lyricist :
Singer :