ప్రేమయే జనన మరణ లీల
మృత్యుపాశమే అమరబంధమౌ ||2||
యువప్రాణుల మ్రోల... ఆ...
యువప్రాణుల మ్రోల... ||ప్రేమయే||
చరణం : 1
ఆకాశమె చెరువయై తోచె
అలలె పొంగి హాయిగ వీచె ||ఆకాశమె||
జీవితమంతా ఒకే పాటుగా
ఎప్పటికీ మనమే ||ప్రేమయే||
చరణం : 2
మధుర మధురతరమైన వాంఛలే
హృదయ సదనమును పరిపాలించె ||మధుర||
సుకృత జన్మము మాదే సఫలం సుఖమే ఈ వేళ ||ప్రేమయే||
చరణం : 3
తను సాంగత్యము త్రుటియే కాదా ||2||
నిలచు దృఢముగా మానసగాధ ||2||
మృత్యుపాశమే అమరబంధమౌ ||2||
యువప్రాణుల మ్రోల... ||ప్రేమయే||
చిత్రం : ఆహుతి (1948)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : శ్రీ శ్రీ
గానం : రావు బాల సరస్వతీ దేవి
***********************************
Movie Name : Aahuthi (1948)
Music Director : Saluri Rajeswar rao
Lyricist : SriSri
Singer : Rao Bala saraswathi devi
( శ్రీ శ్రీ గారు సినిమాలకు రాసిన మొదటి పాట )