అందమైన లోకమనీ రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా...
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మ
చెల్లెమ్మా... అందమైంది కానేకాదు చెల్లెమ్మా ||అందమైన||
చరణం 1
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ||2||
ఆకలికి అందముందా రామ రామా...
ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా... ||అందమైన||
చరణం 2
గడ్డిమేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగి మనిషి విషమౌతాడు ||2||
అది గడ్డి గొప్పతనమా..
ఇది పాల దోష గుణమా.. ||2||
మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా
చెల్లెమ్మా... తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా ||అందమైన||
చరణం 3
ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి
మెగలిపువ్వులోన నాగుంటాది ||2||
ఒక మెరుపు వెంట పిడుగూ...
ఒక మంచిలోన చెడుగూ...
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా... లోతుకెళ్తే కథే వేరు చిట్టెమ్మా ||అందమైన||
చరణం 4
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా ||2||
ఆ ఉన్నవాడు తినడూ...
ఈ పేదను తిననివ్వడూ...
కళ్లులేని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్లు నీవు చూడలేవు చెల్లెమ్మా ||అందమైన||
చిత్రం : తొలి కోడి కూసింది (1981)
సంగీతం : M.S.విశ్వనాథన్
రచన : ఆత్రేయ
గానం : ఎస్.జానకి