పల్లవి :
ఆ... ఆహాహా...
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా... లలలాలలాల లలలా లలలా
నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా
లలాలలాలలా... ఆ....
నీవే నీవే నా ఆలాపన...నీలో నేనే ఉన్నా
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా
చరణం : 1
నీ అందమే అరుదైనది... నా కోసమే నీవున్నది
హద్దులు చెరిపేసి చిరు ముద్దులు కలబోసి
హద్దులు చెరిపేసి చిరు ముద్దులు కలబోసి
పగలూ రేయి ఊగాలమ్మా పరవళ్లలో
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా... లలలాలలాల లలలా లలలా
నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా
లలాలలాలలా... ఆ....
చరణం : 2
ఏ గాలులు నిను తాకినా
నా గుండెలో ఆవేదన... ఆహా...
వలపే మన సొంతం ప్రతి మలుపూ రసవంతం
వలపే మన సొంతం ప్రతి మలుపూ రసవంతం
కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా
నీవే నీవే నా ఆలాపన... నీలో నేనే ఉన్నా
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
చిత్రం : కాంచనగంగ (1984)
సంగీతం : చక్రవర్తి
రచన : సి.నారాయణరెడ్డి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
******************************************************
Movie Name : Kanchana Ganga (1984)
Music Director : Chakravarthy
Lyricist : C. Narayana Reddy
Singers : S.P.Balasubramanyam, S.Janaki