కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమి?
కలలే...! ||2||
నా కలలో నీవే కనబడితే
ఆ చొరవకు బలమేమి?
మరులే...!
మరులు మనసులో స్థిరపడితే
ఆపై జరిగేదేమి?
మనువు...!
మనువై ఇద్దరు ఒకటైతే
ఆ మనుగడ పేరేమి?
సంసారం...! ||కనులు||
చరణం 1
అల్లరి ఏదో చేసితిని
చల్లగ ఎదనే దోచితివి ||2||
ఏమీ లేని పేదనని
నాపై మోపకు నేరాన్ని ||2||
లేదు ప్రేమకు పేదరికం
నే... కోరను నిన్ను ఇల్లరికం ||2||
నింగి నేలకు కడుదూరం
మన ఇద్దరి కలయిక విడ్డూరం ||కనులు||
చిత్రం : సుమంగళి (1965)
సంగీతం : K.V.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల , పి.సుశీల