ఎవరో .. ఎవరో ..ఎవరో .. ఎవరో ..
ఎవరో .. ఎవరో.. ఎదలోనీ వారెవ్వరో
ఎవరో .. ఎవరో.. మదినేలే వారెవ్వరో
మౌనం కరిగించే .. మనసే మురిపించే
నా ఏడేడు జన్మాల తోడెవ్వరో
ఎవరో .. ఎవరో ..ఎవరో .. ఎవరో ..
ఎవరో .. ఎవరో .. ఎదలోనీ వారెవ్వరో
ఎవరో .. ఎవరో .. మదినేలే వారెవ్వరో
మనసై కనిపించే .. మమతే కురిపించే
నా పంచప్రాణాల జాడెవ్వరో !
గుండెలోన పొంగుతున్న ప్రేమకు రూపం ఎవరో
ఇన్నినాళ్ళు దాచుకున్న ఊహల దీపం ఎవరో
మనసులోన తీయనైన గాయం చేసిందెవరో
మాటరాని చూపుతోటే మంత్రం వేసిందెవరో
తొలిఋతువై నన్ను నాకు చూపించెనెవరో
తొలకరిలా మేను వేణు ఊదించెనెవరో
నాలోని తానెవ్వరో !
ఎవరో .. ఎవరో.. ఎదలోనీ వారెవ్వరో
ఎవరో .. ఎవరో.. మదినేలే వారెవ్వరో
సందెవేళ చందనాలు చల్లే జాబిల్లెవరో
ఎండలోన విరగబూసి నవ్వే సిరిమల్లెవరో
నందనాల స్వాగతించు ప్రేమకు రాగం ఎవరో
యమున పొంగు యవ్వనాల అలలకు తాళం ఎవరో
అలికిడిగా అసలు మాట దాచేదెవరో
అలజడిగా మెరుపు కన్ను గీటేదెవరో
తానింక నాకెవ్వరో !
ఎవరో .. ఎవరో .. ఎదలోనీ వారెవ్వరో
ఎవరో .. ఎవరో .. మదినేలే వారెవ్వరో
చిత్రం : ష్..ఇది చాలా మంచి ఊరు (2009)
సంగీతం: శ్రీ వాసంత్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్, గీతా మాధురి