మామా... చందమామా... వినరావా... నా కధ ||2||
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా... చందమామా...
చరణం 1
నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే ||2||
నాలోన లోపమేమో నా మనసే కుమిలెనే
అందరికీ ఆనందం అందించే జాబిలి
నాపైన నీకేలా రాదాయే జాలి ||మామా||
చరణం 2
మచ్చ నీకు ఉన్నా లెక్క చెయ్యరే
ముచ్చటైన నీ వెన్నెలనే మెచ్చుకుందురందరూ
మచ్చలేని నన్ను వెక్కిరింతురే
పిచ్చిదానినంటూ నాపై లేని మచ్చ వేసేరు
నిజము తెలిపినా వినరు మనసు తెలుసుకోలేరు ||2||
నీవుకాక నా వెతలన్నీ వినేవారు ఎవ్వరు
వినేవారు ఎవ్వరు... ||మామా||
చిత్రం : సంబరాల రాంబాబు (1970)
సంగీతం : వి.కుమార్
రచన : రాజశ్రీ
గానం : పి.సుశీల