పల్లవి
[అతడు] గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా
రుసరుసలే కన్నె చూపుల్లో
[ఆమె] చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో
[అతడు] యాయా సౌందర్య ఇది నిజమా యాయా
[ఆమె] అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా
[అతడు] ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా
[ఆమె] హొయ్ చెమటతో చెంగే తాకాలా
హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా ||గుసగుసలే||
చరణం 1
కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో
తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే
ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది
[ఆమె] పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
[అతడు] పదరా పూపొదకే అని సై అన్నట్టే ||2||
[ఆమె] చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు
[అతడు] అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ
చరణం 2
[అతడు] నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది
[ఆమె] మురళివలే స్వరము లీల వాయిస్తూనే
బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు
[అతడు] తగునా ఓ మదనా ఈ తగువంటుంటే ||2||
[ఆమె] తగనా ఓ లలనా ఈ జత కంటాడు ||2||
[అతడు] చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము
[ఆమె] మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం ||గుసగుసలే||
చిత్రం : అన్నయ్య (2000)
సంగీతం : మణిశర్మ
రచన :
గానం : ఉదిత్ నారాయణ్ , సుజాత