ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)
అరె సిన్నోడా ..
ఆకుచాటున పిందె ఉందీ .. చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది .. చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా .. దక్కించుకోరా
దక్కించుకోరా .. దక్కించుకోరా !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
అరె సిన్నమ్మీ ..
మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా
మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే .. ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే .. ఒప్పులకుప్పా !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే .. నాకు నువ్వే
నీకు నేనే .. నాకు నువ్వే !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)
చిత్రం : భక్త కన్నప్ప (1976)
సంగీతం : సత్యం
రచన : ఆరుద్ర
గానం : రామకృష్ణ, పి.సుశీల