పల్లవి :
[ఆమె] అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే
[అతడు] తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే ||కళ్యాణ గడియే||
[ఆమె] పంచాంగాలే పక్కనపెట్టి పరువాలనే చదివేయరా
[అతడు] వారం వర్జ్యం ఒడ్డుకు నెట్టి వయ్యారాలే చూసేన
[ఆమె] నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే
[అతడు] మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే ||2||కళ్యాణ గడియే||
చరణం : 1
[అతడు] ఎటు అడుగులేసిన నా వెనక వచ్చేసేయ్
కుడికాలు ముందుకేసి నా ఎదకి విచ్చేసేయ్ ||2||
[ఆమె] నందమూరి సుందరాంగుడే వేడి చెయ్యి పడితే చిలక కొట్టుడే
[అతడు] పంచదార పాలమీగడే నాకంటపడితే వీరబాదుడే
[ఆమె] నీతోనే వచ్చేస్తా ఏదైనా ఇచ్చేస్తా ||మీయమ్మ మాయమ్మ||కళ్యాణ గడియే||
చరణం : 2
[ఆమె] అడవి రాముడల్లె నీ అల్లరంత చూపు
అగ్గిరాముడల్లె నాలోన సెగలు రూపు||2||
[అతడు] సాయంత్రం పువ్వులు ఇష్టం ఇక తెల్లార్లు నువ్వే ఇష్టం
[ఆమె] నీవల్లే ఇంతటి కష్టం నేనేలే నీ అదృష్టం
[అతడు] చినదాని పెదవుల్లో పుట్టింది పొడితేనె ||మీయమ్మ మాయమ్మ||కళ్యాణ గడియే||
చిత్రం : విజయ దశమి (2007)
సంగీతం : శ్రీకాంత్ దేవా
రచన : ఈశ్వర్ తేజ
గానం : నవీన్ , వసుంధరా దాస్