నీ..మగసిరి మషాలా..నాకే కావాలా
నా పరువం దరువం నీవల్ల దివాలా అవ్వాలా ఇవాళ
నీ సొగసుల ఉయ్యాలా..నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివాలా అవ్వాలా ఇవాళ
||నీ మగసిరి||
నీ సుతారమంతా సుఖాల శృతిలో సితార వాయించనా
ఈ వయారి సొగసులు కాజేసి ముద్దుల విరాళమే ఇవ్వనా
నీ బిగింపు తెగింపు నా ఒంపుసొంపుకి ముగింపు కావాలిరా
నా గులాబిరేకుల జిలేబి కైపులు గులాములవ్వలిరా
నువ్వడిగితే తీసివ్వనా
నీ ఒంటికే సెంటవ్వనా ||నీ మగసిరి||
నీ మిఠాయి మాటల గిటారు పాటలు నిటారితో పాడుకో
నా పరాకి కాళ్ళకి సరైన గురైన జవాబులే చెప్పుకో
నీ హుషారు ఊపుల నిషాలలోపల రసాలు అందించవే
నీ సూదంటి నడుముని నాకంటి చూపుల దారాలలో దాచవే
నీవడిగితే నేనివ్వనా
చేయి తగిలితే పూవవ్వనా ||నీ మగసిరి||
చిత్రం : భారతంలో అర్జునుడు (1987)
సంగీతం : చక్రవర్తి
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam, S.Janaki