వివాహాలే నశించాలి ... విరాగాలే ఫలించాలి
వివాహం నాటకమన్న కాపురం బూటకమన్న
సమస్తం నాశనమన్న పెళ్లిరోజుతో
ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామే మరకటమంట
బ్రతుకంతా చింత చిల్లిముంత ఒక్క మూడుముళ్ళతో
॥వివాహాలే॥
కైక మాటవిని కాక రేగి పరలోకమేగె ఒకడు
అంబ దెబ్బ తిని పంబ రేగి ఉదకంబు తాగెనొకడు
ఇంద్రదేవుడికి ఇంతివల్ల ఒళ్లంత చెడినదపుడు
తారవల్ల మన పూర్ణచంద్రునికి కాక లేచెనపుడు
చిత్రాంగి బలిపెట్టె సారంగుని
కావ్యాలు గ్రంథాలు తిరగేసినా
ఇతిహాసగ్రామాలు వడబోసినా
గయ్యాళిపెళ్ళాలు ఒళ్ళోని దెయ్యాలు
మగవాళ్ళ ప్రాణాలు తీసేటి భూతాలు
అమ్మమ్మో ఆడోళ్ళు రాంటోళ్ళు
ఆఆనోళ్ళూ కలిసిన సుఖమికున్ నరకమునన్ పడకున్
చిన్నా కన్నా వద్దురా ||వివాహాలే||
ఆడదానిపై ప్రేమ అన్నది మాయరోగమనుకో
పాముకన్న అణుబాంబుకన్న అది పెద్ద డేంజరనుకో
గుద్దులాటలు కౌగిలింతలు వట్టి భ్రాంతి బ్రదరూ
ముద్దుగుమ్మ తన ప్రేమ నటనతో పిప్పిచేయు మెదడు
వంటింటి తాబేళ్ళు అవ్వద్దురా
కన్నీళ్ళ కళ్ళాపి చల్లొద్దురా
సన్యాసమే బెస్టు మగజాతికి
స్త్రీ సౌఖ్యమే రొస్టు మగజాతికి
జై వీరహనుమాన్ అనుకోండి రారండి
సద్బ్రహ్మచారులుగా చరితార్థులు అవ్వండి
పెళ్ళిల్లు మానండి పెళ్ళాలు వద్దండి
అతివను వలచుట కన్న మతి చెదిరి తిరుగుట మిన్న
అయ్యా బాబు వద్దురా ||వివాహాలే||
చిత్రం : వివాహ భోజనంబు (1989)
సంగీతం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : Vivaha Bhojanambu (1989)
Music Director : S.P.Balasubramanyam
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam