ఆ చూపేంటి వద్దు ఆ చూపొద్దు
నేనలాంటి వాణ్ణి కాను
చెప్పు తెలుగు భాషకు అచ్చులెన్ని హల్లులెన్ని
అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే
హలో.. హల్లులు ముఫ్ఫైరెండు కాదమ్మా
పాట కోసం నీ నోటికొచ్చిన అంకె చెపితే కుదరదు
ఐదు వర్గాలు య ర ల వ శ స హ లు కలిపితే హల్లులు ముఫ్ఫైఆరు
హల్లులు ముఫ్ఫైఆరు అంతే
అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే
ఇగో ఆగు ఆగు కొంచెం తమాయించుకో
ఈ కుప్పిగంతులు కప్పగెంతులు తర్వాత ముందు ఈ ప్రశ్నకు సమధానం చెప్పు తల్లీ
సంధులు ఎప్పుడు ఏర్పడతాయి
నీవు నాకు ఎదురైతే నేను నీ పక్కకు వస్తే
చస్తే...
నీవు నాకు ఎదురైతే నేను నీ పక్కకు వస్తే నాకేమో గుణసంధి నీకేమో వృద్ధిసంధి మధ్యనెవరూ లేకపోతే
సంయోగసంధి ఇద్దరమూ ఒకటైతే సవర్ణదీర్ఘసంధి
అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే
అమ్మా మతాలంగేష్కర్ ఇక పాటలు ఆటలు ఆపేయ్
తల్లీ..ఇప్పుడు నక్ష్త్రాల గురించి చెప్పుకుందాం
ఏం చక్కగా చెప్పు చూచేచోళా అశ్వని
నువు చూచేలోగా చచ్చును ఈ తరుణి
ఈ లోపల నేను బతికి చస్తే
నువు చూచేలోగా చచ్చును ఈ తరుణి ఆశ్లేష నక్ష్త్రం లో నఖక్షతం కావాలి
ఉత్ప్రేక్షాలంకారం లో ఊహలలో చేరాలి
ఆ తొమ్మిది రాశులలో నాకిష్టం మిథునరాశి
అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే
హల్లులు ముఫ్ఫైరెండు నా కొలతల్లే లోని తహతహలల్లే
చిత్రం : హై హై నాయకా (1989)
సంగీతం : సురేష్ చంద్ర
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
*********************************************
Movie Name : Hai Hai Nayaka (1989)
Music Director : Suresh Chandra
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam, S.Janaki