నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరుకాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
నమ్మినవారికి నాగులచవితికి అమ్మవు నీవమ్మా
పసుపుకుంకుమ పడతులకొసగే దేవత నీవమ్మా
మా ఐదవతనముకు అభయమునిచ్చి అండగా ఉండమ్మ
చల్లని చూపుల నాగమ్మ మా పిల్లాపాపల కాయమ్మ
కరుణించు తల్లివి నీవమ్మా మాకు తోడునీడగ ఉండమ్మా
రత్నాలకాంతుల పడగల భోగభాగ్యాలనిచ్చేటి తల్లివి
పుట్టిమట్టి పుట్టలోనే తల దాచుకొందువమ్మా
||చల్లని చూపుల||
నాటి నీ పాలతో చల్లంగా కాచేవే
నడివిడి నైవేద్యముతో చింతలు మాపేవే
పూజలందుకో శివ నాగమ్మా ఎల్లవేళలా తల్లి నాగమ్మా
దీవెనలియ్యవే దేవ నాగమ్మ దారి చూపవే శ్రీ నాగమ్మ
||నాలుగు దిక్కులె||
క్షీరాబ్ది మథియించు వేళలో చిన్న కవ్వపు తాడుగా మారినా
వన్నెలీను వాసుకి నాగదేవి నీకు తోడై
వేదాల నాదాల సత్యమా ఇన్ని లోకాల కాచేవు నీవమ్మా
శాశ్వత చైతన్యరూపమా మా సన్నుతులందుకో నాగమ్మా
సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచెనే
నింగిలోని మెరుపులన్ని నిన్నే చూపేనే
వెండికొండకే దారి నీవులే కొండ అంచులే నీ పడగలే
లోకసుందరి రూపానివే
అంతు తెలియని నాగశక్తివే ||నాలుగు దిక్కులె||
చిత్రం : దేవతలు (2007)
సంగీతం : ఘంటాడికృష్ణ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : K.S. చిత్ర
*********************************************
Movie Name : Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : K.S.Chitra