పాహి పాహి కాళహస్తీశ్వరా
నమః మహాకాళ కాళేశ్వరా
కదలిరా శ్రీశైల మల్లీశ్వరా
కాపాడ రా రాజరాజేశ్వరా
పాలాభిషేకమ్మిదేరా పాల్కొల్లు క్షీరరామలింగేశ్వరా
తేనాభిషేకమ్మిదేరా గునుపూడి కళ్యాణసోమేశ్వరా
కుంభాభిషేకమ్ము యోగభీమేశ్వరా
వృష్ఠాభిషేకమ్ము భోగభీమేశ్వరా
విభూతి అభిషేకము అమరావతీశ్వరా
గంగాభిషేకమ్ము కాశీవిశ్వేశ్వరా
నమకచమక ప్రియ నాగేంద్రహారా
నమకచమక ప్రియ నాగేంద్రహారా
నా మొరలు విన రారా భక్తిమందారా ||పాహి పాహి||
ఆర్తితో అర్చించినారా ఆదుకో ఆకాశలింగేశ్వరా
భక్తితో సేవించినారా వరమియ్యరా వాయులింగేశ్వరా
విఘ్నభగ్నము చేయు అగ్నిలింగేశ్వరా
ప్రక్షాళనం చేయు జలలింగేశ్వరా
భగ్నమ్మునాపరా పృథ్విలింగేశ్వరా
అభయమ్మునీయరా ఆత్మలింగేశ్వరా
కృప చూపి కుండలినీ యోగీశ్వరేశ్వరా
కృప చూపి కుండలినీ యోగీశ్వరేశ్వరా
నాగబంధమునాప రారా నాగేశ్వరా ||పాహి పాహి||
హే రుద్రనిర్ణిద్ర హే వీరభద్రా
హే వీరభద్రా
చాలించు చిన్ ముద్ర నీ యోగనిద్ర
నీ యోగనిద్ర
నీ త్రిశూలమ్ములో శక్తిన్ ప్రసాదించి నీ త్రినేత్రమ్ములో అగ్నిన్ ప్రసాదించి
ధాత్రిన్ ....ఖండించు భూత మంత్రమ్ములంతమ్ము కావింప రా
శీఘ్రమ్ము రా నాగేంద్రహారా....
చిత్రం : మా ఇలవేల్పు (2004)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : శ్రీకాంత్, ఉష
*********************************************
Movie Name : Maa Ilavelpu (2004)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Srikanth, Usha