నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా
నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా
దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా
చూసిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు...హనుమా...హనుమ
చూసిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు ఆ లంకను కాల్చి వచ్చినావు
సీతమ్మను చూసి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు
రామచంద్రుని ఆలింగన సన్మానమందినావు
రామచంద్రుని ఆలింగన సన్మానమందినావు
సత్కార్య సాధకులందరికి ఆదర్శము నీవు ||నీసరి ఎవరయ్యా||
శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు
ప్రభువుకు మంచి చేసినావు సుగుణములెంచి చూసినావు
శుభమ్ములు కలుగజేసినావు
లక్ష్మణ మూర్ఛను బాపగ సంజీవగిరిని తెచ్చినావు
భక్తులందరిని బ్రోచుటకు చిరంజీవిగా ఉన్నావు..హనుమా ||నీసరి ఎవరయ్యా||
భక్తిపరీక్షకు నిలబడి ఒడిని గుండె చీల్చినావు
రాముని ఎదను చూపినావు అనితర భక్తి చాటినావు
భక్తుల శక్తి చాటినావు
రామనామయని ఘోషించే జపసాగరమే నీవు
రామనామాంబుధి నీవు
రామనామాంబుధి నీవు....హనుమా
హనుమా...నను గనుమా... ||నీసరి ఎవరయ్యా||
భీమసేనుని దారి కాచి సరిదారి చూపినావు
ఆ తమ్ముని తరచి చూసినావు నిజమ్మును తనకు తెలిపినావు
విశ్వరూపమ్మును చూపినావు
జెండాపై కపిరాజై అర్జునరథమునెక్కినావు
అద్భుతమౌ జయమునొసగినావు
అద్భుతమౌ జయమునొసగినావు
హనుమా...హనుమా... ||నీసరి ఎవరయ్యా||
చిత్రం : అంజనీపుత్రుడు (2009)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : వందేమాతరం శ్రీనివాస్
*********************************************
Movie Name : అంజనీపుత్రుడు (2009)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Vandemataram Srinivas