సార్ పోస్ట్ ...మేడం పోస్ట్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేటు జాబు పోస్ట్ మాన్
పోస్ట్ మాన్ లేని ఊరు వేస్టురా కన్నా
నీ బెస్టు ఫ్రెండు పోస్ట్ మాన్ తెలుసుకో నాన్నా
పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వారధేరా ఈ పోస్ట్ మాన్
సారథేరా ఈ పోస్ట్ మాన్ ||మనుషుల్లో||
రామయ్యా ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మాన్
ముల్లోకాల వార్తలన్ని అక్కడికిక్కడ లింకుపెట్టిన నారదుడేరా మేటి పోస్ట్ మాన్
రాజూరాణిల ప్రేమపురాణం రాజమహెంద్రం కోట రహస్యం
మేఘాలల్లో వేగాలతో రెక్కలచాటున భద్రం చేసి
గమ్యం చేర్చిన వార్త విహారీ పావురమేరా స్పీడు పోస్ట్ మాన్
దాని వారసుడేరా నేటి పోస్ట్ మాన్ ||మనుషుల్లో||
భూగోళ్ళమ్మీద ఉన్న ప్రతి ఒక్కరితోను ఉత్తరబంధం ఉన్న ఉత్తముడేరా పోస్ట్ మాన్
ప్రేమపెళ్ళి అనుబంధాలకి మానవజీవన సంబంధాలకి
ముద్దర వేసీ ముందుకు నడిపేవాడు పోస్ట్ మాన్
కులము మతము పట్టనివాడు పేద గొప్ప చూడనివాడు
సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమపెద్దలు పంచేవాడు ప్రజలందరికి చుట్టము వీడు
సహనముతోనే రోజూ సాగేవాడు
శుభము జయమూ మీకు అందిస్తాడు ||మనుషుల్లో||
చిత్రం : పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత Jr
*******************************************************
Movie Name : Post Man (2000)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Udith Narayan, Swarnalatha