అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
కలలో రేపును సెగలే
ఎదలో మోవును లయలే
ఇది పెళ్ళికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై
మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమే మైత్రికి అందం ||అభిమతమో||
కోటి నవ్వులా గూటి గువ్వవు
ఓట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును ఎద మంట
భామిని నో అంటే బాధలు మొదలంటా
సరి అనవా వరమిడవా సరసన నవరస మధురస వీణ ||మధుకలశం||
మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోన భాగమందుకో
ఒంటరి మనుగడలో ఊరట కలిమేలే
బాధల సుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగ నిలిచెడి స్నేహమే సంపద ||అభిమతమో||
చిత్రం : జయమ్ము నిశ్చయమ్మురా (1989)
సంగీతం : రాజ్-కోటి
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
*********************************************
Movie Name : Jayammu Nischayammuraa (1989)
Music Director : Raj-Koti
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, S.Janaki