ఏవండోయ్....
అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళతారేంటండి
అసలు మీరొచ్చిందెపుడండి కాసేపు ఇంట్లో ఉండండి
తిన్నదెప్పుడు పడుకుందెప్పుడు ముచ్చటగా మాట్లాడెదెపుడు
మనసువిప్పి మాట్లాడండి హాయిగ మాతో గడపండి
వానొచ్చేలా ఉందండి...వానొచ్చేలా ఉందండి
మీరుంటే బాగుంటుందండి ||అదోలా||
చక్కని దొరలా ఉండేవారు చిక్కిపోయారు
చిలిపితనాలు చిరుచిరునవ్వులు మరచిపోయారు
పండగపూట ఇంట్లో గడపక ప్రయాణమైపోతారు
పనులమీద పడి శ్రీమతి మీదే శీతకన్ను వేశారు
సందడి పెరిగే వయసండి బాధ్యత మీకూ ఉందండి
డబ్బుతో అన్నీ రావండి హాయిగ ఇంట్లో గడపండి
వెళ్ళకండి అటు చూడండి పిల్లి ఎదురు వస్తూందండి ||అదోలా||
అన్నీ తెలిసి మళ్ళీ ఇంకా ఎందుకు చేస్తారండి
గుడికో సినిమాకో కలిసెళ్ళి ఎన్నాళ్ళయ్యిందో
భర్తే ఇంటికి బంధువులాగ వస్తున్నట్టుందండి
ఇట్టా అయితే ఇరుగూ పొరుగు ఏమనుకుంటారండి
కాపురం కలలా ఉందండి కారణం మీకే తెలుసండి
మనసుతో ఆలోచించండి అసలు ఏ కోపం వద్దండి
అర్థాంగిగా చెప్పానండి అర్థాంగిగా చెప్పానండి
నన్ను అర్థం చేసుకోండి ||అదోలా||
చిత్రం : - ఆవిడే శ్యామల (2000)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : నిత్యసంతోషిణి
*********************************************
Movie Name : Aavide Shyamala (2000)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Nityasanthoshini