కోతికి తోక ఎందుకుంటుంది గురూ
కొమ్మకొమ్మలు వేలాడేందుకు శిష్యా
అద్భుతం..
కుక్కకి పళ్ళు ఎందుకుంటాయి గురూ
పిక్క పట్టుకుని పీకేటందుకు శిష్యా
ఆహా హా...ఓహో హో...
ముక్కు పొడుం కి కంది పొడుం కి తేడా ఏమిటి గురూ
నాయనా..ముక్కు పొడుం ని ఎగబీల్చాలి
కంది పొడుం ని దిగమింగాలి
ఓహో హో...ఓహో హో...
హనీమూన్ కి ఏ ప్లేస్ బెటరు గురూ
గడ్డపలుగు లాంటి వయసులో గడ్డివామైనా కాశ్మీరే శిష్యా...
దారి చూపించారు ధన్యులం
తాగుబోతు మొగుణ్ణి మార్చేదెలా...గురూ
అమ్మా..భర్త క్వార్టరు కొడితే భార్య హాఫ్ కొట్టి వాణ్ణి ఫుల్లుగా కొట్టాలి తల్లీ...
కట్టుకున్నదానికి ఉంచుకున్నదానికి తేడా ఏమిటి గురూ
కట్టుకున్నదేమో కర్మఫలం రా ఉంచుకున్నదేమో పాపఫలం రా
తమరి బోధ పరమాద్భుతం
అయ్యప్పకొండకి తిరుపతికొండకి తేడా ఏమిటి గురూ
అయ్యప్పకొండ పెంచుకొనుట తిరుపతికొండ గొరిగించుకొనుట
ఆహా హా...ఓహో హో...
తీసిన సినిమా హిట్టవడానికి ఏం చేయాలి గురూ
తీసిన కథనే తీసీ తీసీ తోసెయ్యాలి శిష్యా
సూపర్ ఐడియా ధన్యులం
సూర్యుడు తూర్పున ఉదయించుటెందుకు గురూ
పడమర దిశలో..పడమర దిశలో అస్తమించేందుకే..శిష్యా
వన్స్ మోర్ వన్స్ మోర్
అన్ని కులాలకు న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా
తందానా తందాన గురువు నందనాన
ఒక్కొక్క కులమొక్క పార్టీ పెడితే చిక్కులు తీరేను శిష్యా
తందానా తందాన శిష్య నందనాన
తరిగట జమ్మరిగతా
పార్టీకి నష్టము ఎందుకు గురూ
ప్రజాసేవ కర్తవ్యమన్నందుకు శిష్యా
ఏడుకొండలవాడ గోవిందో హాయ్
మీ ఆశీస్సులు కావాలంటే ఏమి చేయాలి గురూ
క్యాషీస్సులు మీరిస్తే చాలు ఆశీస్సులు మేమిస్తాం మీకు శిష్యా
శ్రీ సందేహానంద స్వామీజీకి జై
చిత్రం : సోంబేరి (2008)
సంగీతం : మనో
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మనో, జొన్నవిత్తుల, సాకేత్, శ్రీదేవి
*********************************************
Movie Name : Somberi (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, Jonnavithula, Saketh, Sridevi