సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా
విధిరాతకెదురీత ఇంత విపరీతమా
సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా
విధిరాతకెదురీత ఇంత విపరీతమా
కల్లోల భూతాల...కలికాల ఘోరమా
కల్లోల భూతాల కలికాల ఘోరమా
మహిమ కోల్పోతివా మాంగళ్య మంత్రమా
సింధూర తిలకాన పడె అశనిపాతమే
అసహాయతను చాటె కనుల జలపాతమే
బ్రహ్మముడి విడదీసే వికటాట్టహాసమే
కర్కశపు హస్తాలు ...సిగలాగె విలవిల
కర్కశపు హస్తాలు సిగలాగె విలవిల పుష్పాలు భాష్పాలుగా రాలె
జలజల ముక్కలైనది గుండె చేతి గాజులవలె
భీభత్సమైపోయె సకల సౌభాగ్యం
జీవచ్ఛవంబాయె పడతి తనుమాత్రం ||సౌభాగ్యదేవికే||
కోటి కుంకుమరాశి కనకదుర్గమ్మయే అభయమొసగి అయ్యె నుదుటి కుంకుమగా
దివ్యవాక్కులతోడ ఘన గౌరవము కూర్చు శ్రీ సరస్వతి మారె సతి పసుపు చీరగా
చుట్టుప్రక్కల నింగి శూన్యమైనట్టుగా చుక్కలన్నియు చేరె సిగలోన పూలుగా
కటిక చీకటినెల్ల త్రుటిలోన వెలిగించు కాళికాదేవియే మారె కాటుకగా
నాగదేవత అయ్యె మాంగళ్యధనముగా
అఖిల దేవతలు అయ్యె ఆభరణ రాశిగా
అడుగు వేసెను ధూర్త విధ్వంసమూర్తిగా
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
సర్వ పర్వతశ్రేణి తిరగబడి ఒరగగా
సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా
అనిలాగ్ని భూతాలు స్తంభించిపోవగా
దశదిశాగాశాలు గజగజా వణకగా
భీకర పిశాచాలు భీవభీకలు కాగా
ప్రేతభూతాలెల్ల తడబడుచు పరుగిడగా
ఆది ముత్తైదువై అగ్ని సింహాకృతై
అఖిలాండ బ్రహ్మాండ కోటి శక్తాత్మయై
ఘ్రీంకార హూంకార ధిక్ ధిక్ విరుక్తాల
ఘ్రీంకార భీంకార హుక్ హుక్ ప్రయుక్తాల
ప్రళయ ప్రగర్జనల గర్జా ప్రతిధ్వనుల
విళయ మాయారూప వికృత దైత్యాదమున్
ఖండింపగా దూకె కాళకాళేశ్వరి సింహ శ్రీచండీశ్వరీ
( శ్లోకం )
చిత్రం : దేవతలు (2007)
సంగీతం : ఘంటాడికృష్ణ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam