వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరీ
మీకేలే మా పూజలే భువిలోని భువనేశ్వరీ
పద్దెనిమిది శక్తిపీఠాలలో ముజ్జగములే ఏలే పెద్దమ్మలు
వెలసె అత్తమ్మ చెల్లెమ్మ పరదేవతలు ||వేవేల జేజేలివే||
మా గుండెలో నీ గుడిగంటలై
మారుమ్రోగేనే కోనంతా మా ఊరంతా
నాలుగు రేకుల ప్రక్కన నువ్వు ఊరికి ఇచ్చే దీవెన
ఇల్లిల్లు చేసేను చల్లన నీవెన్నెల చూపుల పాలన
సెలయెరులా అడవి పొలిమేరలా
ఉరికి ప్రవహించు ఓయమ్మ నీ ప్రేమయై
వేవేల చేతులతో వెలసితివమ్మా
అమ్మా ముగ్గురమ్మలకే నువు మూలపుటమ్మ
కొండల కోనల మధ్యలో కోటి సూర్యులచంద్రుల వెలుగుతో
అండదండలియ్యనుంటివే అక్కమ్మ చెల్లెమ్మ బంగరు తల్లి ||వేవేల జేజేలివే||
నీవే కదా శ్రీ భ్రమరాంబిక
ఆ కాశీపురి అన్నపూర్ణాంబిక
మాధవీదేవివి నీవెగా ఆ మాణిక్యాంబవి నీవెగా
జోగులాంబదేవి నీవెగా పురుహూతికా దేవి నీవెగా
శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే
సిరుల కొళాపురి మహాలక్ష్మివి నీవే
బెజవాడలో కనకదుర్గాంబవి తల్లీ ఉజ్జయినిలో మహాకాళివి నీవే
ఎక్కడ ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎన్నెన్ని రూపాలలో ఉన్నను
అక్కమ్మ చెల్లెమ్మ రూపున మా పక్కనే ఉందువు చక్కని తల్లి ||వేవేల జేజేలివే||
చిత్రం : దేవతలు (2007)
సంగీతం : ఘంటాడికృష్ణ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : K.S. చిత్ర
*********************************************
Movie Name : Devathalu (2007)
Music Director : Ghantadi Krishna
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : K.S.Chitra