జై దుర్గా జై జై జైశక్తి జై
దిగి రావమ్మా ఇక మాకోసమై
జై దుర్గా జై జై జైశక్తి జై
దిగి రావమ్మా ఇక మాకోసమై
కళ్ళురిమినావో రక్కసులే అంతం
కరుణించినావో లక్ష్మీప్రసన్నం ||జై దుర్గా||
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
ఆ....ఆవేశమే త్రిశూలమై మర్దించగా ఇక దీవించవే
ఈ....ఉద్రేకమే రుద్రాంశతో ఉప్పొంగగా శుభం చేకూర్చవే
జయీభవ అనవే జైదుర్గా జగమంతా శాంతివనం చేస్తానే ||జైదుర్గా||
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
ఘ్రీంకారి లయకారి హూంకారి రావే మాంకాళి
నీ.....భక్తునితో తలపడితే తలలే తెగునే ఇలలోన
ఎదుటపడి ఎదురించి బ్రతికేదెవరే ఇకపైన
పిడికిలి బిగిసిన చాలులే హడలెత్తిపోవాలి లోకాలన్ని ||జైదుర్గా||
చిత్రం : పుణ్యభూమి నా దేశం (1994)
సంగీతం : కె. వి. మహదేవన్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
*********************************************
Movie Name : Punyabhumi Naa Desham (1994)
Music Director : K.V.Mahadevan
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, K.S.Chitra