సుర్రూ సుర్రనుకురా సూరీడా
మమ్ము చల్లంగ చూడరా సూరీడా
మండీపడకురా సూరీడా
మేముండే ఎడారిలోనా సూరీడా
రెచ్చిపోయి గుచ్చబోకు సూరీడా
రేయీపగలు కూడ సూరీడా ||సుర్రూ సుర్రనుకురా||
తెలుగోళ్ళ కుర్రోళ్ళు తెలివిగల కుర్రోళ్ళు పనికని వచ్చారురా
ఈ గల్ఫ్ కి పనికని వచ్చారురా
చాకులాంటి కుర్రోళ్ళు చురుకైన కుర్రోళ్ళూ ఉద్యోగాలకొచ్చారురా
ఈ షార్జా కి ఉద్యోగాలకొచ్చారురా
అమ్మానాన్నలకి ఆలుబిడ్డలకి దూరంగా ఉన్నవాళ్ళురా
వీళ్ళ ఆరోగ్యం ఎప్పుడూ ఉక్కులాగ ఉండాలిరా
ఉక్కబోత తగ్గించరా...దేవుడా రక్షించరా ||సుర్రూ సుర్రనుకురా||
యాభైరెండు డిగ్రీలు దాటుతున్న ఎండలోనే డ్యూటిలోనే ఉంటారురా
పనికై పాటుపడుతుంటారురా
ఇసుకతుఫానులోన ఎత్తైన మేడలపైన కష్టపడుతుంటారురా
పనిలో కరిగిపోతుంటారురా
ఎర్రనిప్పులైన ఇక పనోళ్ళ చెమటని అర్ఘ్యమున అందుకోరా
నే చెమ్మగిల్లు కళ్ళతోటి మళ్ళీ మళ్ళీ అడుగుతున్న అందరిని ఆదుకోరా
వీళ్ళ ఇళ్ళు ఒళ్ళు కాపాడరా
అల్లా.....అక్బర్
హరీనాం తుం బోలేరో...
హరీనాం తుం బోలేరో... ||సుర్రూ సుర్రనుకురా||
చిత్రం : సోంబేరి (2008)
సంగీతం : మనో
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మనో, శంకర్ మహదేవన్
*********************************************
Movie Name : Somberi (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, Shankar Mahadevan