నా చిన్నప్పుడు నేనూ ఇంతే
ఒకతో ఏట రెండో ఏట
మూడో ఏట నాలుగో ఏట
ఐదో ఏడు వచ్చేసరికి
ఆరో ఏట ఏడో ఏట ఎనిమిదో ఏట
తొమ్మిదొఏడు వచ్చేసరికి...
అవకతవకలు అష్టవంకరలు అన్నీ నాకే ఉండేవి
అమ్మో పిల్లకి ఏంటీ ఖర్మని హడలిపోయి మా అమ్మ
అప్పటికప్పుడు అప్పయ డాక్టరు దగ్గరికెత్తుకు వెళ్ళింది
చూపు ఆనని అప్పయ డాక్టరు ....హా...హా...
వంకరటింకర గీతలతోటి మందులచీటి రాసిచ్చాడు
రాసిందేది మందులషాపులో కాసింతైనా అర్థం కాక
పిప్పరమెంట్లు చాక్లెట్లిచ్చి చప్పరించమని పంపించారు
మా అమ్మేమో కంగారు పడితే నాన్నగారేమో మెదలక ఉంటే
తాతయ్యేమో కదలకపోతే మా బామ్మేమో భయపడుతుంటే
మా అమ్మమ్మేమో ఫరవాలేదని ధైర్యం చెప్పిందందరికి
అప్పుడు ఆవిడ ఏమందంటే....
ఓంకారం వంకర....శ్రీకారం వంకర
అందమైన ఆడపిల్ల ఆకారం వంకర
హరివిల్లు వంకర.....నెలవంక వంకర
కిందనుంచి పైదాకా కృష్ణమూర్తి వంకర
ఓంకారం వంకర.....శ్రీకారం వంకర
వినాయకుడి ముక్కు వంకర
హనుమంతుడి తోక వంకర
నారదుడి మాట వంకర
నందీశుడి కొమ్ము వంకర
జీడిపప్పు వంకర.....జిలేబి వంకర
తాతమీసం వంకర......బామ్మ అలక వంకర
ఒంటిపూస తేలుతున్న కొంకిలాంటి కొండి కన్న
గుచ్చిగుచ్చి బాధపెట్టు చుప్పనాతి చూపు నీది
నల్లమండ్ర గబ్బ లాగ డెక్కితోటి పట్టి కుట్టు గీర గీర నిక్కు నీది నేతిబీర టెక్కు నీది
కొక్కిరాయి ముక్కు నీది కీచురాయి గొంతు నీది
నాపరాయి మూతి నీది ఇటుకరాయి మొహం నీది
పొగరుబోతు దున్న నువ్వు వగరుబోతు కోతి నువ్వు
కుల్లుబోతు కాకి నువ్వు అదిరిపాటు మేక నువ్వు
తోక తెగిన బల్లి నువ్వు దొంగకళ్ళ పిల్లి నువ్వు
కొంగ ముక్కు చుంచు నువ్వు పెద్దగుండు సున్న నువ్వు
చిత్రం : సుందరకాండ (2008)
సంగీతం : విద్యాసాగర్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : K.S.చిత్ర
*********************************************
Movie Name : SundaraKanda (2008)
Music Director : Vidyasagar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : K.S.Chitra