పల్లవి :
ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాలా
ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాలా
ఎదిగే వయసుల ఉయ్యాల ఎగిరే పైటల ఉయ్యాలా
ఎదిగే వయసుల ఉయ్యాల ఎగిరే పైటల ఉయ్యాలా
ఏదేదో అయ్యేలా
ఏలో ఏలో ఉయ్యాలా ఏడేడు రంగుల ఉయ్యాలా ll ఏలో ఏలోll
చరణం : 1
అనగనగా అన గనగా ఉయ్యాలా అడవీ పక్కన పల్లె ఉయ్యాలా
ఆ పల్లె జాబిల్లి బంగారు నా తల్లి అందాల సిరిమల్లి ఉయ్యాలా..
ఆకోనకొకనాడు కోటాను దొరబాబు వచ్చి మల్లిని చూసె ఉయ్యాలా...
మనసుపడి మనువాడే ఉయ్యాలా
ముద్దూ ముచ్చట జరిపీనాడే ఉయ్యాలా..
మల్లీనక్కడ విడిచీనాడే ఉయ్యాలా
మళ్ళీ తిరిగీ రాలేదమ్మా ఉయ్యాలా ll2ll ll ఏలో ఏలో ll
చరణం : 2
రాముని కాలపు సీతమ్మా... ఆ సీతమ్మే మాయమ్మా... ll2ll
తనగుండే గుడి చేసే ఉయ్యాలా అ గుడిలోన దేవుడా ఉయ్యాలా
ఒక్కడే ఉన్నాడు ఉయ్యాలా ఒక్కడే ఉంటాడు ఉయ్యాలా
ఒక్కడే ఉంటాడు ఉయ్యాలా
చిత్రం : సుందరకాండ (2008)
సంగీతం : విద్యాసాగర్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : సాధనాసర్గమ్
*********************************************
Movie Name : SundaraKanda (2008)
Music Director : Vidyasagar
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Sadhana Sargam