రావే రావే ఓ కోయిలా .....రావే రావే ఓ కోయిలా
రావే రావే ఓ కోయిలా..... రావే రావే ఓ కోయిలా
కొండాకోనలా పొంగే తేనెలా
రాగంతోటి ప్రాణం పోసే అందరి నేస్తం లా
రావే రావే ఓ కోయిలా..... రావే రావే ఓ కోయిలా
అహో మధురం కుహుకుహు గమకం
మహాకుసుమం రంగుల గగనం
చిత్రాలై చిందులేసే అందాలు మిత్రాలై మీదికొచ్చే చైత్రాలు
పిల్లాగాలి వేసే ఈలల్లో ప్రతి గుండెల్లోన అల్లోనేరెళ్ళు
అద్దం లాంటి చెరువునీళ్ళల్లో తడి పుత్తడిబుగ్గల కన్నెల ఊహళ్ళో
సరాగమాడగా... ||రావే రావే||
ప్రతీ ఉదయం రసమయనిలయం
ఇదే సమయం ప్రతిభకు విజయం
నా ప్రాణం పలికే నీకే ఆహ్వానం
నీ గానం వింటూ ఉంటే ఆనందం
నీకూ నాకూ మధ్య ఈ దూరం నీ పాటే కదా వలపుకు ఆధారం
అభిమానుల ప్రేమే నీ సొంతం నీతో జట్టేకట్టే తరగని అదృష్టం
వరాలనీయగా... ||రావే రావే||
చిత్రం : ఈడు-జోడు (2010)
సంగీతం: సత్యం రత్నాల
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: చిత్ర (Female version), దీపు (Male version)
*******************************************************
Movie Name : Eedu - Jodu (2010)
Music Director : Satyam Rathnala
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Chitra (Female version), Deepu (Male version)