అగ్నిశిఖల సంకేతం ఈ గీతం
భరతజాతి జాగృతికిది సందేశం
ఆవేశం కోల్పోయిన మీకోసం
గర్జించే...అర్జున శంఖారావం ||అగ్నిశిఖల||
అర్రచకత్వం ... ప్రబలిన దేశం
అమాయకులకే బలిపీఠం
సాహసవంతులు చచ్చిన సంఘం
సగటు మనుషులందరికి ఉరికంబం
పౌరహక్కు పతనానికి పరాకాష్ఠ ఈ ఘట్టం
అల్లూరి, భగత్ సింగ్ పునర్జన్మమీ సాక్ష్యం
ఒక్కసారి పచ్చినిజం పల్లవి పాడండి
గూండా రక్కసి రాజ్యం..కూల్చేయండి ||అగ్నిశిఖల||
అమానుషంగా...సహనమూర్తినే
వంచనతో బలిచేసిన ఘాతకులు
కిరాతకంగా దేశమాతపై గుళ్ళవాన కురిపించిన విద్రోహులు
దేశానికి దారుణాల తోరణాలు కడుతుంటే
అనుక్షణం ఈ సంఘం రణరంగం అవుతుంటే
సాహసించి చేయండి శాంతికి నవయఙ్ఞం
దురంతాల అంతానికి ఇదే మనకు శుభలగ్నం ||అగ్నిశిఖల||
చిత్రం : భారతంలో అర్జునుడు (1987)
సంగీతం : చక్రవర్తి
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
*********************************************
Movie Name : Bharathamlo Arjunudu (1987)
Music Director : Chakravarthy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : SP. Balasubramaniam