పుకారే పుకారే ఊరంతా పుకారే
ఔనంటే హొయ్యారే ఏమైనా తయ్యరే
నన్ను లేపుకుపో అందగాడా సైరా రారా
సర్దుకో ఇక పెట్టాబేడా
అహ ఇద్దరం ఇక తోడూనీడా ||పుకారే పుకారే||
సిగ్గుపడితే ఒంటిగంట సందడిలో
ముగ్గు పెడతా బుగ్గమీద చక్కెరతో
ఇష్టపడితే ప్రేమ లోతు చూపెడతా
రెచ్చగొడితే రేకు విప్పి జోకొడతా
మోజుపడితే మీదపడతా
వేడిపుడితే వెంటపడతా
ఊహలకందని ఊపుల అల్లరి పుచ్చుకో పుచ్చుకో
వామనగుంటల వాయిన ఉంది అందుకో అందుకో
చెయ్యిపడుతుంటే చెంగుమీద ఆహా ఆహా ఓహో ఓహో
మోసుకో మజా ఒత్తిళ్ళని
కాసుకో కసి కౌగిళ్ళకి ||పుకారే పుకారే||
కుర్ర సరసం కుమ్ముతుంటే కోరికలే
కన్నెపరువం జివ్వుమంది కౌగిళ్ళలో
ఎర్రబడితే వెర్రిమొర్రి యవ్వనమే
కొల్లగొడతా జెల్లగొట్టి తిమ్మిరులే
కన్నుకొడితే జున్నుపెడతా
వెన్నుతడితే వచ్చిపడతా
కొబ్బరిమోజుల రబ్బరు సాపులు చుట్టుకో చుట్టుకో
హద్దులు దాటిన ఇద్దరి ఆశలు ఇరుకో ఇరుకో
పట్టుకుదిరిందా పక్కమీదా...ఆహా ఓహో
కొత్తగా భలే మత్తోయమ్మ ... మెత్తని కసి పత్తాయమ్మ
||పుకారే పుకారే||
చిత్రం : పేకాట పాపారావు (1993)
సంగీతం : రాజ్-కోటి
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, రాధిక
*********************************************
Movie Name : Pekata Paparao (1993)
Music Director : Raj-Koti
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, Radhika