ఓ నాగదేవి కరుణించవే
పొరాపాటులన్ని మన్నించవే
ఓ నాగదేవి కరుణించవే
పొరాపాటులన్ని మన్నించవే
ఇలవేలుపై ఇల్లు చేరవే
కులదేవతై కొలువుండవే
గైకొనవే మా పూజలే ||ఓ నాగదేవి||
ఓంకార రూపము శ్రీ చక్రయంత్రము ఓ దేవీ నీ నడకలే
శ్రీ విష్ణుపాదము శివదేవ శూలము నీ పడగపై మొలుచులే
నీ పుట్టకు మొక్కితి అమ్మా మా పుట్టుక సఫలము సుమా
నీ పుట్టమట్టిలో మహిమా జై కొట్టి చాటునే బ్రహ్మ
ఏడేడు లోకాలకే... ||ఓ నాగదేవి||
లోకాలదారులు ముక్కోటి నదులు నిన్ననుకరించేనులే
నీ బుసల ఊసులు ఆ వేదఘోషలు నూరేళ్ళ ఆశీస్సులే
నమ్మితిమే నాగమ్మ మమ్ము చల్లగ కాపాడమ్మా
మా తప్పుల మన్నించమ్మా ఇక తరలి వేగమే రమ్మా
నీరాజనమే నీకిది ||ఓ నాగదేవి||
చిత్రం : మా ఇలవేల్పు (2004)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఉష
*********************************************
Movie Name : Maa Ilavelpu (2004)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Usha