అతడు : నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఆమె : ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
అతడు : నీవు చూసే చూపులకు వన్నెలాడీ
నీరుగారి పోతానె చిన్నెలాడి
మనసు దాచుకోలేను నవనీతమ్మ
పది మాటలైన చెప్పలేను ముద్దులగుమ్మా "నీ"
అతడు : ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ
మోసపుచ్చి పోతావు చిన్నవాడ
మాటవరసకైన నువ్వు రమణయ్ మావా "ఎంత"
అతడు : నీ తోటి సరసమాడి పడుచు పిల్లా
నెల్లూరు వెళతానే గడుసు పిల్లా
మళ్ళి తిరిగి వస్తానే నవనీతమ్మా
నిను మరచిపోయి ఉండలేనె ముద్దులగుమ్మా "నీ సోకు"
ఆమె : నెల్లూరు పోతేను నీటుగాడా
తెల్ల బియ్యం తెస్తావా నీటు గాడా
పక్క ఊళ్ళో నువ్వుంటె రమణయ్ మావ
నే ప్రాణాలు నిల్పలేను రమణయ్ మావ "ఎంత"
చిత్రం : తోడి కోడళ్ళు (1957)
సంగీతం : మాస్టర్ వేణు
రచన : కొసరాజు , తాపీ ధర్మారావు
గానం : మాధవపెద్ది సత్యం , జిక్కి