పల్లవి :
ఆడుతు పాడుతు పనిచేస్తూంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది ॥
చరణం : 1
ఒంపులు తిరిగి ఒయ్యారంగా
ఊపుతు విసరుతు గూడేస్తుంటే (2)
నీ గాజులు ఘల్లని మోగుతుంటే
నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది...
॥
చరణం : 2
తీరని కోరికలూరింపంగా
ఓర కంట నను చూస్తూ ఉంటే (2)
చిలిపి నవ్వులు చిందులు తొక్కి...
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది
నును సిగ్గు ముంచుకొస్తున్నది...
॥
చరణం : 3
చెదరి జారిన కుంకుమరేఖలు
పెదవుల పైన మెరుస్తువుంటే (2)
తీయని తలపులు నాలో ఏమో...
తీయని తలపులు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి
అహ... తికమకజేస్తూవున్నవి
ఆడుతు॥
చరణం : 4
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి (2)
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది... ఆ... ॥
చిత్రం: తోడి కోడళ్ళు (1957)
సంగీతం: మాస్టర్ వేణు
రచన: కొసరాజు
గానం: ఘంటసాల, పి.సుశీల