ఆడితప్పని మాయంమ అభిమతాన
సత్యమెరిగిన వ్యాసుని శాసనాన
పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన
నడచుచున్నాట్టి ధర్మబంధమది వనితా
చిత్రం : నర్తన శాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
రచన : సముద్రాల
గానం : ఘంటసాల
****************************************************
ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే
సొగసరీ ఒకపరి వివ్రించవే
చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును
గడుసరీ ఏమని వివరింతును
ఆఆ..వలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచీ విరహాల రేపు
ఎదలో మెదిలే చెలికాని రూపు
ఏవో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబరాలే (ఎవ్వరి కోసం)
ఆఆ..పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసీ మరపించు మనసు
ప్రణయము చిందే సరసాల గంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో (ఎవ్వరి కోసం)
చిత్రం : నర్తన శాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
రచన : శ్రీ శ్రీ
గానం : ఘంటసాల , సుశీల